తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో హైజాక్ హైడ్రామా

దీంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఇద్దరు పైలెట్ కాక్‌పిట్‌లోకి ప్రవేశించారు. కంగారుపడిన పైలట్ హైజాక్ అని భావించాడు. వెంటనే హైజాక్ జరిగిందనే సమాచారాన్ని విమానాశ్రయ సిబ్బంది ఇచ్చాడు. పైలట్ హెచ్చరికలతో విమానాశ్రయ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
విమానం హైజాక్ అయిందని, దిగాలని అధికారులు ప్రకటించారు. అయితే ప్రయాణీకలు మాత్రం విమానం దిగేందుకు ససేమీరా అన్నారు. అధికారులు బలగాలను అప్రమత్తం చేశారు. సిఐఎస్ఎఫ్ బలగాలు అక్కడకు చేరుకున్నాయి. అయితే విమానం ఎలాంటి హైజాక్‌కు గురి కాలేదని ఆ తర్వాత తెలిసింది.
కాక్‌పిట్‌లో ఎవరో చొచ్చుకొచ్చే ప్రయత్నాలు చేయడంతో పైలట్ కంగారుపడి హైజాక్ అలారం మోగించాడని తెలుసుకున్నారు. పైలట్ పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రయాణీకులు మాత్రం తాము ఎవరం కాక్‌పిట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. ఈ విమానంలో 200 మంది ప్రయాణీకులు ఉన్నారు.












Click it and Unblock the Notifications