మధ్యప్రదేశ్ ఆలయంలో తొక్కిసలాట: ఇద్దరు మృతి

కొండపై నుంచి తిరిగి వస్తుండగా కాళ్లు జారి కిందపడిపోవడంతో ఇద్దరు మరణించారు. ఓ మహిళతో పాటు బాలిక కింద పడిపోవడం తొక్కిసలాటకు కారణమైందని అంటున్నారు. ఇది తొక్కిసలాట కాదని, ఓ 30 ఏళ్ల మహిళ, 14 ఏళ్ల బాలిక కిందికి దిగి వస్తుండగా కాళ్లు జారి పడిపోయారని, ఈ సంఘటనలో వారు మరణించారని పోలీసులు అంటున్నారు. అదే రకంగా మరో 13 మంది గాయపడ్డారని చెబుతున్నారు.
గాయపడినవారిని భోపాల్, సెహోర్ అస్పత్రులకు తరలించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చారు.












Click it and Unblock the Notifications