వేధింపులతో విద్యార్థి సూసైడ్: రైలు ఢీకొని ఇద్దరు మృతి

అప్పటి నుండి ఆకతాయిలు తమ వేధింపులను ఎక్కువ చేశారు. దాంతో మనస్తాపం చెందిన హారిక ఆత్మహత్య చేసుకుంది. వారి వేధింపుల వల్లనే తాను ఆత్మహత్య చేసుకున్నానని తన సూసైడ్ లేఖలో పేర్కొంది. అమ్మాయి తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అమ్మాయిని ఫోన్లోనూ బెదిరించేవారని వారు చెబుతున్నారు. ఈమెను వేధించిన ఆకతాయిపై ఇతర కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
రైలు ఢీకొని తల్లీ కూతుళ్లు మృతి
వరంగల్ జిల్లాలో రైలు ఢీకొని తల్లీ కూతురు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. కూతురు అనిత మెడలోని బంగారు గొలుసును ఓ దొంగ ఎత్తుకు పోయాడు. దాని గురించి తల్లి ప్రమీల, కూతురు అనిత పట్టాలపై వెతుకుతుండగా గూడ్స్ రైలు వారిని ఢీకొంది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.












Click it and Unblock the Notifications