బైబిల్‌ను కించపర్చారు: టిడిపి నేతపై నాగార్జున కేసు

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బైబిల్‌ను రాజకీయాలకు వాడుకుంటున్నారని రాజేంద్ర ప్రసాద్ ఆదివారం విమర్శించిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ముమ్మాటికీ మత ప్రచారమే చేశారని రాజేంద్ర ప్రసాద్ ఆదివారం అన్నారు.
ఆయన కృష్ణా జిల్లా విజయవాడలో విజయమ్మ మత ప్రచారం చేసిన సిడిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయమ్మ బైబిల్ చేత పట్టుకొని ఖచ్చితంగా మత ప్రచారమే చేస్తున్నారని ఆరోపించారు. పవిత్రమైన ఏసుక్రీస్తు నామం స్మరిస్తూ వేలకోట్లు దోచుకున్నారని నిప్పులు చెరిగారు.
విజయమ్మ బైబిల్ పైన ప్రమాణం చేసి తాము రాష్ట్రాన్ని దోచుకోలేదని చెప్పగలరా అని సవాల్ చేశారు. జగన్ అక్రమంగా దోచుకున్న వేలకోట్ల సొత్తును పేద ప్రజలకు, పేద క్రైస్తవులకు పంచి పెట్టాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications