హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వన్ నేషన్ వన్ ఇండియా:రూ.కోటి తీసుకున్న గంగూలీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sourov Ganguly
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ కుంభకోణంలో అరెస్టైన ప్రదాన నిందితుడు సాయి కుమార్... తాను భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీకి వన్ నేషన్ వన్ కార్డు ప్రమోషన్ కోసం రూ.కోటి ఇచ్చినట్లుగా అంగీకరించారు. అంతేకాకుండా తాను రూ.510 కోట్ల రూపాయలను వివిధ ప్రభుత్వం, ప్రయివేటు ఏజెన్సీల నుండి డిపాజిట్ల రూపంలో దేశవ్యాప్తంగా వసూలు చేసినట్లు చెప్పాడు. కాగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ కుంభకోణం కేసులో కీలక సూత్రధారి సాయికుమార్ బుట్టలో సౌరవ్ గుంగూలీ కూడా పడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసందే.

సాయికుమార్ చేపట్టిన వన్ కార్డ్ - వన్ నేషన్‌ పథకానికి గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. వన్ కార్డ్ బిజినెస్ మోడల్ గురించి గంగూలీ ఆలోచించారా అనేది కూడా అనుమానంగానే ఉందనే వార్తలు వచ్చాయి. మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ కుంభకోణం సూత్రదారి సాయి కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్. అతని బ్యాంకుల పనితీరు గురించి పూర్తిగా తెలుసునని అనుకోవడానికే వీలుంది. కవరింగ్ లేఖ సాయంతో నిధులను మళ్లించడానికి అవకాశం ఉందని గుర్తించిన అతను తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశాడని అంటున్నారు.

మొత్తం 165 సంస్థలను స్థాపించడంతో పాటు వన్ కార్డ్ - వన్ నే,షన్ పేరుతో క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు అన్నంటినీ ఒకే కార్డులో ఇస్తామని చెబుతూ పెద్ద యెత్తున ప్రచారం చేపట్టాడు. దీని ప్రచారానికే అతను మైనారిటీ కార్పోరేషన్ నుంచి కొల్లగొట్టిన ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని వార్తలు వచ్చాయి. తద్వారా బ్యాంకుల నుంచి వంద కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవాలని కూడా అతను వ్యూహం రచించాడని మీడియా కథనాల సారాంశం.

వన్ కార్డు వన్ నేషన్ విధానాన్ని కనీసం 300 కోట్ల రూపాయలకు విక్రయించాలని కూడా ఎత్తు వేశాడట. ఆ రకంగా వచ్చిన డబ్బుల నుంచి ఎఫ్‌డిల ద్వారా కొల్లగొట్టిన 55 కోట్ల రూపాయలు చెల్లించేసి, మిగతా డబ్బుతో వ్యాపారాలు చేయాలని సాయికుమార్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. వన్ కార్డు వన్ నేషన్ డాట్ కామ్ పేరుతో ఓ వెబ్‌సైట్ కూడా ఏర్పాటైంది.

English summary
Prime accused in the AP State Minorities Finance Corporation (APSMFC) scam, Ch V K Sai Kumar, confessed that he paid Rs 1 crore to former Indian cricketer Sourov Ganguly for promotion of his 'One Nation One Card' (ONOC) programme. He also claimed he had collected Rs 510 crore worth deposits from several government agencies and public sector undertakings (PSUs) across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X