జీతమిస్తున్నారా: మీడియాపై విజయకాంత్ చిందులు

దేశీయ మురుపొక్కు ద్రవిడ ఖజగం(డిఎండికె) ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జయలలితతో భేటీ అవుతున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో అతను ఆగ్రహంతో చిందులు తొక్కారు. నువ్వడిగిన దానికి సమాధానం చెప్పడానికి మీ పత్రికేమైనా నాకు జీతమిస్తోందా అని ప్రశ్నించారు. అన్ పార్లమెంటరీ పదాన్ని కూడా వాడారు.
శుక్రవారం మదురై సెంట్రల్, తిట్టక్కుడి డిఎండికె ఎమ్మెల్యేలు జయలలితతో భేటీ అయి... విజయకాంత్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు. నటుడు, పేరావూరణి ఎమ్మెల్యే అరుణ్‌పాండ్యన్, రాధాపురం ఎమ్మెల్యే మైఖేల్ రాయప్పన్ శనివారం జయలలితతో సమావేశమయ్యారు.
తమ నియోజకవర్గాల్లోని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వివరణ కోరడంతో విజయకాంత్ విలేకరులపై చిందులేశారు. ముఖ్యమంత్రితో భేటీ అయిన ఎమ్మెల్యేని అడగండంటూ విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. ఆయన వ్యవహారం పట్ల పాత్రికేయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications