విజయమ్మకు ఉమ ప్రశ్న: జగన్‌పార్టీతో భేటీపై ఎమ్మెల్యే

నల్గొండ జిల్లాకు ఎవరు ఎంత మేలు చేశారో విజయమ్మ తెలుసుకోవాలని సూచించారు. జిల్లా రైతులకు తెలుగుదేశం పార్టీ హయాంలో మోటార్లతో నీటిని సరఫరా చేశామన్నారు. నిత్యం విశ్వసనీయత అంటున్న విజయమ్మకు ఆ పదం అర్థం ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. విశ్వసనీయతకు అర్థం తెలుసుకొని మాట్లాడాలన్నారు.
కడప జిల్లా, నల్గొండ జిల్లాలో రిమ్స్‌కు ఒకేరోజు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో శంకుస్థాపన జరిగిందని, కడప జిల్లా రిమ్స్ పూర్తయినప్పటికీ ఇక్కడి రిమ్మస్ ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. నల్గొండ జిల్లాకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి న్యాయం జరిగిందన్నారు.
భేటీ లేదు.. చందర రావు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను తన తనయుడు కలిశారనడంలో ఎలాంటి వాస్తవం లేదని కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు వేరుగా అన్నారు. తమను అభాసుపాలు చేసేందుకే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. కొందరు ప్రలోభాలకు లొంగి పార్టీలు మారుతున్నారని విమర్శించారు. కాని తాను ఎప్పటికీ టిడిపిలోనే ఉంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications