నావైఫ్‌కు వెలకట్టలేం: థరూర్, కార్యకర్తనికొట్టిన సునంద

Shashi Tharoor-Sunanda Pushkar
తిరువనంతపురం: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కేంద్రమంత్రి శశి థరూర్ మంగళవారం తిప్పి కొట్టారు. తన భార్య సునంద పుష్కర్‌కు సుగుణాలకు విలువ కట్టలేమన్నారు. కొందరు చెప్పినట్లుగా తన భార్య విలువ రూ.50 కోట్ల కంటే ఎక్కువే అన్నారు. ఆమె గుణాలను డబ్బులతో విలువ కట్టలేమన్నారు. అర్థం చేసుకునే మనసు ఉంటే ఎవరూ విమర్శించరని శశి థరూర్ కౌంటర్ ఇచ్చారు. ఆ విషయాన్ని అర్థం చేసుకునే మనసు ఉంటే విమర్శించరన్నారు. థరూర్ ట్విట్టర్‌లో మోడీ వ్యాఖ్యలపై స్పందించారు. కాగా శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ ఓ కాంగ్రెసు కార్యకర్త చెంపను చెల్లుమనిపించారు. దీనిపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా సోమవారం నరేంద్ర మోడీ శశి థరూర్ పైన తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సోమవారం కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతల పైన సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్రమంత్రి శశి థరూర్ పైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో మోడీ ప్రచారం నిర్వహించారు. రూ.50 కోట్ల గర్ల్ ఫ్రెండ్ అంటూ శశి థరూర్ భార్య సునంద పుష్కర్‌ను మోడీ అభివర్ణించారు. ''ఏమి గర్ల్ ఫ్రెండ్.. ఎప్పుడైనా మనం రూ.50కోట్ల గర్ల్ ఫ్రెండ్‌‍ను చూశామా'' అంటూ థరూర్‌ను ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు.

వంట గది ముఖం ఎరుగని మహిళకు గ్యాస్ ధరల పెంపు వల్ల వంటింటి మహిళలు పడుతున్న కష్టాలు ఏమి తెలుస్తాయంటూ సోనియా గాంధీపై విరుచుకు పడ్డారు. ఆదివారం జరిగిన విస్తరణను ఆయన విడిచి పెట్టలేదు. అవినీతి మంత్రికి సల్మాన్ ఖుర్షీద్ ప్రమోషన్ ఎందుకిచ్చారని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ కాదు, మౌన్ మోహన్ సింగ్ అంటూ ఎద్దేవా చేశారు. మౌన్ మోహన్ మౌనాన్ని వీడటం అతి పెద్ద వార్త అన్నారు.

ఆయన ఏనాడైనా పెరిగిన నిత్యావసర ధరలపై మాట్లాడారా.. క్షమాపణ చెప్పారా అని ప్రశ్నించారు. క్రికెట్ పేరిట కోట్లు సంపాదించారని ఆరోపణలున్న శశి థరూర్‌కు మళ్లీ అవకాశం కల్పించారని దుయ్యబట్టారు. కొద్ది రోజుల క్రితం సోనియా మండి వచ్చారని, ప్రధాని కూడా నిన్ననే వచ్చారని, అయితే వారు ధరల పెరుగుదల వండి పేదల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తే సంతోషించే వాడిని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+