కెసిఆర్‌ది పూటకోమాట: జగ్గారెడ్డి, షర్మిల యాత్రపై కిరణ్

షర్మిల పాదయాత్ర కూడా అధికారం కోసమే అన్నారు. పార్టీని రక్షించుకునేందుకు ఇలాంటివి చేస్తున్నారే తప్ప ప్రజల కోసం కాదన్నారు. అందుకే వారిని ఎవరూ విశ్వసించడం లేదన్నారు. వారు ప్రజలకు చేసేందుకు అధికారంలో లేరన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నారని, అయినా ప్రజల కోసం ఇందిర బాట పేరుతో యాత్ర చేస్తున్నారన్నారు. సంగారెడ్డికి మంజీరా తరలింపునకు ముఖ్యమంత్రి ఒకే చెప్పారన్నారు.
తెలంగాణపై ఆ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను ప్రాణహిత - చేవెళ్ల కోసం ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారని చెప్పారు.
ఒకరిద్దరు పోయినా నష్టం లేదు.. కిరణ్
పార్టీలో నుండి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెళ్లి పోయినా ఎలాంటి నష్టం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. షర్మిల, చంద్రబాబులు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో వారికే తెలియదన్నారు. రాష్ట్రానికి ఎక్కువ కేంద్రంలో ఎక్కువ పోర్టు పోలియోలు వచ్చినందున ఎక్కువ నిధులకు డిమాండ్ చేయవచ్చునన్నారు.
తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకునే వరకు అందరూ వేచి చూడాలన్నారు. 2014 వరకు కాంగ్రెసు ప్రభుత్వమే కొనసాగుతుందని కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. బాబు, షర్మిలలది కేవలం రాజకీయం, అధికార యాత్ర మాత్రమే అన్నారు. బాబు గతంలో ఆల్ ఫ్రీ వాగ్ధానాలు చేశారని, వాటిని ప్రజలు నమ్మలేదని, వాగ్ధానాలకు ఎలాంటి ఖర్చు లేదు కాబట్టే ఆయన చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications