భారతి సవాల్‌కు పెదవి విప్పట్లేదేం: టిడిపికి జూపూడి

వారు చేసిన ఆరోపణలు నిజమే అయితే జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి చేసిన సవాలుకు పెదవి విప్పాలన్నారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారంలో దిట్టలు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు జగన్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశ్యం తప్ప ప్రజా సమస్యలపై ఏమాత్రం లేదన్నారు. అదే ఉంటే రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదన్నారు.
చంద్రబాబు పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునే సరికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ బయటపడతారన్నారు. అందుకే చంద్రబాబు కాలు నొప్పి, నడుం నొప్పి అని సాకులు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు మోపుతున్నారని విమర్శించారు.
కర్నూలు జిల్లా కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే తమకు వచ్చే నష్టమేమీ లేదని వైయస్సార్ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. 2014లో తమ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జగన్‌కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు.












Click it and Unblock the Notifications