విలీనానికి కెసిఆర్ ఓకె చెప్పారు: కెకె, 4 గంటలు భేటీ

దీనిపై కెకె తెరాస ఒంటరిగా కాకుండా ఇతర పార్టీలలోని తెలంగాణవాద ప్రజాప్రతినిధులతో కలిసి ఉద్యమించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దీనికి కెసిఆర్ కూడా ఆమోదించారు. అనంతరం కెకె మీడియాతో మాట్లాడారు. తాను తెరాసలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనన్నారు. కాంగ్రెసు పార్టీ ఎంపీలు ఎవరూ తెరాసలో చేరరన్నారు. పార్టీలోనే ఉంటూ వారు తెలంగాణ కోసం ఉద్యమిస్తారన్నారు.
నిరాహార దీక్ష విషయం తమ మధ్య చర్చకు రాలేదన్నారు. తనను కెసిఆర్ వారి పార్టీలోకి కూడా ఆహ్వానించలేదన్నారు. ఉద్యమానికి తుది రూపం కల్పించే అంశం పైనే తమ మధ్య చర్చ జరిగిందన్నారు. పార్లమెంటు సమావేశాల్లోగా కాంగ్రెసు అధఇష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే ఏ నిర్ణయం తీసుకోవడానికైనా తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కెసిఆర్ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications