శాంతిభద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు: కిరణ్ రెడ్డి

రైతులకు ఎంత చేసినా తక్కువే అని నమ్మే ప్రభుత్వం తమది అన్నారు. ఆయిల్ ఫాం రైతులకు వ్యాట్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. యాంత్రీకరణ ద్వారా రైతులకు 50 శాతం రాయితీ ఇస్తున్నామని, 32 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రైతులకు ఆదుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. దేశంలో కేవలం మన దేశంలోనే పది శాతం రైతులు పంట రుణాలను మన రాష్ట్రంలోనే పొందుతున్నారన్నారు.
మెరుగైన పాలన అందిస్తామన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్‌లను ఆదర్శంగా తీసుకొని పని చేస్తామన్నారు. ఆక్వా రంగానికి 468 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేసినట్లు చెప్పారు. సాగు రైతుకు ఏటా రూ.2వేల కోట్ల రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు.
వచ్చే రెండేళ్లలో పదహారువేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీపడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతికి శాంతిభద్రతల పరిరక్షణ చాలా ప్రధానమన్నారు. విద్యుత్ రంగంలో సమస్యలున్నా ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు.
ప్రస్తుతం రోజుకు 286 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా 225 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేస్తున్నామన్నారు. కొరతను అధిగమించడానికి అందుబాటులో ఉన్న మొత్తం విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామన్నారు. 2013 డిసెంబర్ నాటికి దక్షిణ గ్రిడ్ పూర్తి చేస్తామన్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications