నేనే హోంమంత్రినైతే: టిజి వెంకటేష్, మరిన్ని.. లగడపాటి

తాము అప్పట్లో కర్నూలును హైదరాబాదుకు రాజధానిగా త్యాగం చేశామని చెప్పారు. అప్పుడే రాష్ట్రం విడిగా ఉంటే కర్నూలు ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళ హోంమంత్రి కావడం వల్లనే అవతరణ వేడుకలను తెలంగాణవాదులు అడ్డుకున్నారన్నారు. హోంమంత్రిగా సబితా ఇంద్రా రెడ్డి కాకుండా తానో మరొకరో అయి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహింప చేసే వాళ్లమన్నారు.
రాష్ట్ర అవతరణ వేడుకలను బహిష్కరించిన వారు అసెంబ్లీలో ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారు బాధ్యతలు నిర్వహించక పోవడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన వాటిల్లో తెలంగాణనే మొదట ఉంటుందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందన్నారు.
అనేకం జరుపుతాం.. లగడపాటి
ఇలాంటి నవంబర్ 1 రాష్ట్ర అవతరణ వేడుకలు ఇంకా అనేకం జరుపుతామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి అవతరణ వేడుకలను నిర్వహించారు. లగడపాటితో సహా కార్యక్రమంలో పాల్గొన్న వారు సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications