చిరంజీవి ప్రమాణం: 'కాకతీయ' నిధులపై తొలి సంతకం

పర్యాటక శాఖ తనకు ఎంతో ఇష్టమైన శాఖ అన్నారు. భారత దేశం విభిన్న సంస్కృతులకు ప్రత్యేకమైనదన్నారు. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తనకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.
విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు చేపడతానని చెప్పారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానన్నారు. కాగా చిరంజీవిని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం చిరంజీవిని తన మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు ఆయనకు పర్యాటక శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయమంత్రిగా సర్వే సత్యనారాయణ మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా కొత్త కార్యాలయంలో ప్రవేశించిన సర్వే వేదపండితుల ఆశీర్వాదం అందుకొని ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications