మోడికి సునంద చురక: శశి కోసం ప్రేమ శాఖ.. ముక్తార్

ఐపిఎల్ వివాదంపై తాను ఈడికి వివరణ ఇచ్చానని తెలిపారు. గతంలో 70 కోట్లుగా చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రూ.50 కోట్లుగా చెబుతోందన్నారు. ఇంత హఠాత్తుగా ఇరవై కోట్ల రూపాయలు ఎలా తగ్గాయని, మిగిలిన ఆ డబ్బును వారేమైనా తీసుకున్నారా అని ప్రశ్నించారు. కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలు రాజకీయాల్లో లేకున్నప్పటికీ వారిని కేజ్రీవాల్ కూడా టార్గెట్ చేసుకోవడం సరికాదన్నారు.
కాగా మోడీ వ్యాఖ్యలపై శశి థరూర్ ప్రేమించే గుణం ఉండాలని రెండు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. శశి వ్యాఖ్యలపై బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందించారు. అంతర్జాతీయ ప్రేమ గురువు అయిన శశి థరూర్ కోసం ప్రేమ వ్యవహారాల శాఖను ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. ఆయనను ఆ శాఖకు మంత్రిగా నియమించాలన్నారు. నక్వీ వ్యాఖ్యలను పల్లం రాజు, మనీష్ తివారి ఖండించారు.
మరోవైపు తిరువనంతపురంలో సునందా పుష్కర్ పట్ల ఓ కార్యకర్తపై సునంద చేయి చేసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పందొమ్మిదేళ్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె అసంతృప్తికి గురైంది. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పాడు. అయితే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించింది కాంగ్రెసు కార్యకర్త కాదని, ఆయన క్షమాపణలు తెలిపాడని, అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications