హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీలం ఎఫెక్ట్: భారీ వర్షాలు, మరో 24 గంటలు ఇలాగే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Cyclone Nilam shakes India, ravages Sri Lanka
హైదరాబాద్/చెన్నై: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో నీలం ప్రభావం కారణంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా పలు ప్రాంతాలలలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గురువారం ప్రకాశం జిల్లాలో కుంభవృష్టి కురిసింది. 21 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. ఈ సీజన్‌లో మన రాష్ట్రంలో ఇదే అత్యధిక రికార్డ్.

పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గురువారం కురిసిన వర్షాలతో రాష్ట్రంలో ఆరుగురు, తమిళనాడులో పదకొండు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. లక్షళ ఎకరాల పంట నీట మునిగింది. నీలం తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌లకు కొంతమేర నష్టం కలిగించినా ఎక్కువ లాభమే కలిగించింది.

నీలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రబీ సాగుకు ఊపిరి పోసింది. అయితే శ్రీలంకలో మాత్రం దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్టల్ ఏరియాలో, రాయలసీమ ప్రాంతంలో నీలం కారణంగా హెవీ వర్షాలు కురుస్తున్నాయి. నీలం కారణంగా శ్రీలంకలో ఆరుగురు మృతి చెందగా, 70,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

English summary
As it was predicted by the Met Department, Cyclone Nilam hit, shook and ravaged coastal regions of India and Sri Lanka. Though ill-effects of the cyclone were comparatively mild in India, it had devastated many parts in Sri Lanka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X