బాబు కాన్వాయ్‌లో వెహికిల్ బోల్తా: కృష్ణాలో విజయమ్మ

జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి సమీపంలో జాతీయ రహదారిపై చంద్రబాబు కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుండి వాహనంలో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఎదురుగా ఓ గేదె వస్తుండగా దానిని తప్పించబోవడంతో బాబు కాన్వాయ్‌లోని వాహనం బోల్తా పడింది.
ఆ తర్వాత చంద్రబాబు కృష్ణా జిల్లాకు చేరుకున్నారు. గన్నవరంలో మీడియాతో మాట్లాడారు. తాము ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డెడ్ స్టోరేజీ సమయంలో కూడా వ్యవసాయానికి నీటిని ఇచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన సరిగా లేదన్నారు. ఓ వైపు విద్యుత్ లేక మరోవైపు భారీ తుఫానుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నీటి కొరత, విద్యుత్ కొరతతో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారన్నారు. పంట నష్టం తర్వాత అధికారులు పర్యటిస్తున్నారని విమర్శించారు. కాగా అంతకుముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె సోమ, మంగళ.. రెండు రోజులు తుఫాను బాధిత ప్రాంతాలను పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు.












Click it and Unblock the Notifications