మిస్సమ్మ ఆస్తులు కబ్జా: జగన్ ఎమ్మెల్యేపై నారాయణ

Narayana
హైదరాబాద్: అనంతపురం పట్టణంలోని నడిబొడ్డున ఉన్న మిస్సమ్మ భూములను అనంతపురం జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి ఆక్రమించుకున్నారని, ఈ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సోమవారం రాజ్‌భవనంలో గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

గవర్నర్‌ను నారాయణ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం కలిసింది. నరసింహన్‌కు ఆస్తులను కాపాడాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతపురం నగరంలో 1910లో లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిస్ క్రిస్ట్ లిబ్‌కు(మిస్సమ్మ) మిషనరీ సేవల నిమిత్తం ప్రభుత్వం 26.5 ఎకరాల భూమిని అసైన్ చేశారని, 1920లో ఆమె లండన్‌కు వెళ్లడంతో ఆ తరువాత ఆ భూములు అన్యాక్రాంతమయ్యాయని నారాయణ గవర్నర్‌కు వివరించారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరిట అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. దానిని స్వాధీనం చేసుకుని పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి కేటాయించేలా, గుర్నాథరెడ్డిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. అఖిలపక్ష నేతల విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+