ఐఎంజి కేసులో సాయి కౌంటర్: జగన్‌కేసులో మళ్లీ జప్తు!

మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) రెండో దఫా జఫ్తుకు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సిబిఐ ఛార్జీషీట్లను సమగ్రంగా పరిశీలించిన ఈడి అధికారులు ఈ కేసులో రెండో నిందితుడు, జగన్ సంస్థల ఆడిటర్ విజయ సాయి రెడ్డిని సోమవారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈడి ప్రధాన కార్యాలయంలో సాయిని డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్, విచారణ అధికారి కమల్ సింగ్ అరగంటకు పైగా విచారించారు.
జగన్ ఆస్తులు, సంస్థల ఆస్తులపై విచారణ జరిగినట్లుగా సమాచారం. ఇప్పటికే జగతి పబ్లికేషన్స్, హెటిరో డ్రగ్స్ తదితర సంస్థలకు చెందిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 18 తేదీలోపు దీనిపై విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే రెండో విడత జప్తునకు కూడా ఈడి అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే విజయ సాయిరెడ్డిని విచారించినట్లు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని విజయసాయి రెడ్డి తమ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలతో ఈడి అధికారులు ధ్రువీకరించుకున్నట్లు చెబుతున్నారు. మరో పది, పదిహేను రోజుల్లో రెండో విడత జప్తు ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications