ఏకగ్రీవ ఎన్నిక: 'డింపుల్ ఇంటికి నోటీసులు అంటించండి'

నోటీసులు ఆమెకు నేరుగా ఇచ్చేందుకు అధికారులు భయపడిన పక్షంలో ఇంటికి అంటించాలని సూచించింది. గత జూన్ నెలలో జరిగిన కన్నౌజ్ పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలలో డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఓటర్ పార్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన ప్రభాత్ కుమార్ పాండే అనే వ్యక్తి సదరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తాను భావించానని, తాను నామినేషన్ వేయకుండా సమాజ్ వాది పార్టీకి చెందిన వారు కొందరు అడ్డగించారని ఆయన ఆరోపించారు.
తనను కిడ్నాప్ కూడా చేశారని అందువల్లే, తాను నామినేషన్ వేయలేక పోయానని, దీంతో డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు వివరణ కోరుతూ డింపుల్‌కు పలుమార్లు నోటీసులు పంపించింది. దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో విచారణ ఈ నెల 22వ తేదికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications