తెలంగాణ: ఆర్ట్స్‌కాలేజివద్ద ఉరేసుకున్న విద్యార్థి, ఉద్రిక్తం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదిలాబాది జిల్లాకు చెందిన సంతోష్ అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట గల చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో విద్యార్థులు, తెలంగాణవాదులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సంతోష్ ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

తెలంగాణ కోసమే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సంతోష్ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ఘటనా స్థలం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని సంతోష్ భౌతికాయాన్ని అక్కడ నుండి తరలించే ప్రయత్నాలు చేశారు. విద్యార్థులు వారి చర్యలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
విద్యార్థులు తెలంగాణకు, సంతోష్‌కు అనుకూలంగా, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నేతలు మాట్లాడుతూ... తాము ఉస్మానియా నుండి గన్ పార్క్ వరకు సంతోష్ అంతిమ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఓయు పరిధిలో బుధవారం, గురువారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయు రిజిస్ట్రార్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications