హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్కదెబ్బకి టిడిపి, బిజెపి: ఎన్నికల్లో 'ఢీ'కి కెసిఆర్ ప్లాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు! తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్న టిడిపి, ఇప్పుడిప్పుడే తెలంగాణ వాదంతో తమకు చెక్ చెప్పాలని చూస్తున్న బిజెపిని గట్టిగా ఢీకొనేందుకు కెసిఆర్ కొత్త వ్యూహాన్ని రచించారు. అందులో భాగంగా తెలంగాణవాదం వినిపిస్తున్న మరో పార్టీ సిపిఐతో వచ్చే ఎన్నికల్లో జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ రోజు కరీంనగర్ జిల్లాలో జరిగిన మేధోమథనంలో కెసిఆర్ పార్టీ నేతలకు సిపిఐతో పొత్తు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణవాదాన్ని పలు పార్టీలు వినిపిస్తున్న నేపథ్యంలో తెరాస కొద్దిగా బలహీనపడింది. గత రెండేళ్లుగా ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు. అదే సమయంలో కెసిఆర్ నిత్యం అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అని చెప్పడం కూడా ఆ పార్టీ కొంప ముంచింది. కెసిఆర్ చెప్పే మాటలు నమ్మని స్థితికి తెలంగాణ ప్రజలు వచ్చారు.

దీంతో తెరాస మరోసారి ప్రధానంగా ఉండేందుకు ప్రత్యామ్నాయం కోసం వెతికిన కెసిఆర్‌కు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా సిపిఐ కనిపించినట్లుగా ఉంది. సిపిఐ చంద్రబాబు ఆధ్వర్యంలోని టిడిపి పార్టీకి మద్దతుగా మొదటి నుండి నిలుస్తోంది. అయితే ఒక్క తెలంగాణ విషయంలో విభేదిస్తోంది. అందుకే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సీమాంధ్రలో టిడిపికి మద్దతిచ్చిన సిపిఐ తెలంగాణలో మాత్రం తెరాసకు మద్దతు పలికింది.

అయితే తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చంద్రబాబు ప్రకటించిన తర్వాత సిపిఐ నారాయణ వైఖరి టిడిపికి మరింత దగ్గరగా వెళ్తున్ట్లుగా కనిపించింది. ఇలాంటి సమయంలో కెసిఆర్ తెలంగాణలో టిడిపిని దెబ్బ కొట్టే వ్యూహంలో భాగంగానే సిపిఐతో పొత్తు తెరపైకి తీసుకు వచ్చి ఉంటారని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణవాదం వినిపిస్తున్న బిజెపి హవాకు కూడా చెక్ చెప్పేందుకు సిపిఐతో పొత్తు ఉపయోగపడుతుందని కెసిఆర్ భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన మేధోమథనంలో సిపిఐ పొత్తు అంశాన్ని ప్రస్తావించారని, అయితే సిపిఐ ఏ మేరకు స్పందిస్తుందో చూడాలంటున్నారు.

English summary
Telangana Rastra Samithi president K Chandrasekhar Rao gave indications in medhomadhanam that TRS will allie with CPI in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X