పదవులకు నో: కూతురు బెర్త్‌కే కావూరి అలక వీడారా?

Kavuri Sambasiva Rao
హైదరాబాద్: ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అలక వీడినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కేంద్రమంత్రి వర్గంలో తనకు చోటు దక్కక పోవడంతో కావూరి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తప్ప మిగిలిన అన్ని పదవులకు రాజీనామా చేస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు పంపినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పార్టీలో సీనియర్‌ను అయిన తనకు కాకుండా నిన్న పురంధేశ్వరి.. ఇవ్వాళ చిరంజీవికి పదవులు కట్టబెట్టడం ఆయనకు ఏమాత్రం రుచించలేదు.

దీంతో అతను పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించకుండా నిమిత్తమాత్రుడిగా కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని ఆయన తన అనుచరులకు చెప్పి వారి అనుమతి కూడా తీసుకున్నారట. అన్ని పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే ఆయనను బుజ్జగించేందుకు సోనియా గాంధీ సైతం రంగంలోకి దిగారట. కావూరితో దిగ్విజయ్ సింగ్ భేటీ ఆయి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.

కావూరిని బుజ్జగించేందుకు ప్రయత్నించిన పలువురు ఢిల్లీ పెద్దలు అతనికి పార్టీలో ముఖ్యమైన పదవులు ఇస్తామని చెప్పారట. కానీ ఆయన మాత్రం ససేమీరా అని, తనకు కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందేనని ఖరాఖండిగా చెప్పారట. కావూరిని మంత్రివర్గంలోకి తీసుకోకుంటే ఆయన వారం రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని ఈ నెల ప్రారంభంలో జోరుగా వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే ఆయన చల్లబడినట్లుగా కనిపిస్తోంది.

అధిష్టానంపై తీవ్రంగా అలకబూనిన కావూరి తాడో పేడో తేల్చుకునేంత వరకు వెళ్లి.. ఇప్పుడు సైలెంట్ అయిపోవడం వెనుక ఓ కారణం ఉండవచ్చుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన పార్టీ పదవులు వద్దని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందేనని అధిష్టానం నచ్చజెప్పిందట. ఎందుకు పదవి ఇవ్వలేక పోతున్నామో వివరించిందట. అయితే ఢిల్లీ పెద్దల మాటలు సావదానంగా విన్న కావూరి వారి ముందు ఓ కండిషన్ పెట్టారట.

వచ్చే ఎన్నికల్లో తన కూతురుకు టిక్కెట్ ఇస్తానని హామీ ఇస్తే అలక వీడేందుకు సిద్ధపడ్డారట. అయితే పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందో లేదో కానీ ఆయన మాత్రం అలకవీడినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుత పరస్థితిని చూస్తుంటే ఆయనలో అసంతృప్తి తగ్గినట్లుగా కనిపిస్తోందని, అలక వీడటమే నిజమైతే ఆయన తన కూతురు బెర్త్ ఖాయం చేసుకున్నాకే వెనక్కి తగ్గి ఉంటారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+