రాముడంటే నాకు గిట్టదు, క్షమాపణ చెప్పను: జెత్మలానీ

Ram Jethmalani
న్యూఢిల్లీ: శ్రీరాముడిపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదని బిజెపి సీనియర్ నేత రాం జెత్మలానీ అన్నారు. రాముడిపై చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకోబోనని ఆయన తెగేసి చెప్పారు. తానేమీ తప్పు చేయలేదని ఆయన శుక్రవారం ఓ ప్రముఖ మీడియా చానెల్‌తో అన్నారు. శ్రీరాముడంటే తనకు గిట్టదని ఆయన అన్నారు. శ్రీరాముడు చారిత్రక పురుషుడా అని ఆయన ప్రశ్నించారు.

బిజెపిని ఇబ్బంది పెట్టాలన్నది తన ఉద్దేశం కాదని, బిజెపిని బలోపేతం చేయాలన్నదే తన లక్ష్యమని ఆయన అన్నారు. శ్రీరాముడిపై తనకు అనేక అనుమానాలున్నాయని ఆయన అన్నారు. శ్రీరాముడు మంచి భర్త కాడని ఆయన మరోసారి అన్నారు. అమయాకురాలైన సీతను శ్రీరాముడు అడవుల పాలు చేశాడని, జాలరి ఆరోపణలకు సీతను శ్రీరాముడు అడవులకు పంపించాడని ఆయన మరోసారి అన్నారు.

లక్ష్మణుడు చూస్తుండగానే రావణుడు సీతను అపహరించుకుపోయాడని ఆయన అన్నారు. లక్ష్మణుడి పాత్ర సరిగా లేదని అభిప్రాయపడ్డారు. తాను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేశ హాస్యరసాన్ని ఆస్వాదించలేని స్థితిలో ఉందని, దానికి తానేమీ చేయలేనని ఆయన అన్నారు.

తన మతపరమైన భావలను స్క్రూటినైజ్ చేయకూడదని, అనవసరమైన వివాదాలు సృష్టించవద్దని ఆయన మీడియాను కోరారు. మీ వ్యాఖ్యలు బిజెపిని ఇబ్బంది పెట్టాయా అని అడిగితే బిజెపి మతపరమైన పార్టీ కాదని, హిందువుల మతవ్యవహారాలపై బిజెపి నియంత్రణ లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+