హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాతబస్తీ ఉద్రిక్తం: ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేల అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం వివాదం ముదురుతోంది. చార్మినార్ వద్ద ఆదివారం ఉదయం ఎంఐఎం నిరసన చేపట్టారు. దీంతో అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పాతబస్తీలో 144వ సెక్షన్ విధించారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు చార్మినార్ వద్ద ఆందోళన చేస్తున్న ఎంఐఎం శాసనసభ్యులను ఐదుగురిని అరెస్టు చేశారు.

ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్, ముంజంఖాన్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు 144వ సెక్షన్ విధించడం, పరిస్థితి టెన్షన్‌గా మారడంతో పాతబస్తీలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదివారం వెల్లడించారు. నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలందరు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి పుకార్ల నమ్మవద్దని పజలుకు నగర ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలయం విషయంలో హైకోర్టు సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలను పాటిస్తామని చెప్పారు.

English summary
Hyderabad police arrested five MIM MLAs and sent to Bollaram police station for their agitation at Charminar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X