ఇదిరా భారత్ అంటే.. శత్రువైనా పాకిస్థాన్ కు భారీ సాయం..!!
భారత్ సరిహద్దు దేశం అయిన పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదమే.. భారత్ ను ఎలా దెబ్బతీయాలా..? అని పాకిస్థాన్ ఎప్పుడూ పావులు కదుపుతూ ఉంటుంది. పాకిస్థాన్ తన దేశంలోని ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ అవసరమైనప్పుడు భారత్ పై ఉసిగొల్పుతోంది. ఇప్పటికే చాలా సార్లు భారత్ పై ఉగ్రమూకలు దాడులు చేసిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రమూకలు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనక ఉన్నది పాకిస్థాన్ అని తెలిసి ఆ దేశంపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. గతేడాది మే 7-10 మధ్య జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రమూకలను హతమార్చింది.
అలాగే పాకిస్థాన్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇరు దేశాల మధ్య ట్రావెలింగ్, వాణిజ్యం నిలిపివేసింది. అలాగే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సైతం భారత్ నిలిపివేసింది. దాంతో పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. నీళ్లు, రక్తం ఒకే చోట ప్రవహించవని ఆ సమయంలో భారత్ స్పష్టం చేసింది. అయితే పాకిస్థాన్ మాత్రం భారత్ పై అంతర్జాతీయ వేదికల్లో దుష్ప్రచారం చేస్తోంది. భారత్ నీటిని ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపిస్తోంది. అయినా భారత్ మాత్రం.. మానవతా దృక్పథంతో చీనాబ్ నది వల్ల రాబోయే వరదల ముప్పు గురించి పాకిస్థాన్ ను తాజాగా అప్రమత్తం చేసింది. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ కు భారత్ సమాచారం అందించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
జమ్మూకాశ్మీర్ లోని రియాసీ జిల్లాలో ఉన్న సలాల్ డ్యామ్ లో పేరుకుపోయిన పూడికను తొలగించడానికి అధికారులు గేట్లను ఓపెన్ చేశారు. దీనివల్ల చీనాబ్ నదిలోని నీటిమట్టం 2 నుంచి 3 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ అదనపు నీటి ప్రవాహం మే 30 వరకు దిగువన ఉన్న పాకిస్థాన్ కు చేరుతుందని భారత అధికారులకు ఆ దేశానికి ముందస్తు సమాచారం ఇచ్చారు. భారత్ హెచ్చరికతో పాకిస్థాన్ ప్రభుత్వం అలర్ట్ అయింది. పంజాబ్ ప్రావిన్స్ లో వరద అలర్ట్ ప్రకటించింది. సహాయక బృందాలను రంగంలోకి దించింది. సియాల్ కోట్ వంటి సరిహద్దు జిల్లాల్లో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

గతేడాది ఆగస్టులో కూడా సట్లెజ్ నది వరదల సమయంలో ఇలాగే భారత్.. ముందస్తు సమాచారం ఇచ్చి లక్షలాది పాకిస్థానీ ప్రజల ప్రాణాలను కాపాడింది. ఇక భారత్ ఇంత సాయం చేసినప్పటికీ పాకిస్థాన్ మాత్రం తన బుద్ధిని ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ వేదికల్లో భారత్ ను నిందించడం ఆపడం లేదు. ఇటీవల తజికిస్థాన్ వాటర్ కాన్ఫరెన్స్ లో పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్.. అలాగే ఐక్యరాజ్యసమితిలో అక్కడి విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. భారత్ ను విమర్శిస్తూ ప్రసంగించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications