'మా ఇంటి బంగారం' ట్రైలర్ రివ్యూ: సమంత ఖాతాలో మరో హిట్టు..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 2010 లో ఏమాయె చేశావే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. అటు తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను ఏర్పరుచుకుంది సమంత. ఇక 2017 లో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ వివాహం చేసుకుంది సమంత. అయితే 2021 లో వ్యక్తిగత కారణాలతో ఈ దంపతులు విడిపోయారు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ లో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుంది సమంత. సమంత, రాజ్ నిడిమోరుల పరిచయం 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా స్టార్ట్ అయింది.

ఇక ప్రస్తుతం సమంత సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ఓ బేబీ వంటి సూపర్ హిట్ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 19 న రిలీజ్ కానుంది. మా ఇంటి బంగారం మూవీ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీలో సమంత ఓ సాధారణ మధ్యతరగతి గృహిణిగా కనిపిస్తూనే.. తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి శత్రువులతో పోరాడే ఒక పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో నటిస్తోంది. ఈ చిత్రం కోసం సమంత డూప్ లేకుండా సొంతంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ చేసినట్లు సమాచారం.
మా ఇంటి బంగారం మూవీని కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్, గ్రామీణ నేపథ్యంతో రూపొందించినట్లు స్పష్టం అవుతోంది. ఇక ఈ మూవీ ట్రైలర్ 3 నిమిషాల 5 సెకనుల నిడివితో ఉంది. ఈ ట్రైలర్ లో సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఓ వైపు అమాయకపు కోడలిగా, మరోవైపు విలన్స్ ను హడలెత్తించే అండర్ వరల్డ్ మహిళగా అదరగొట్టింది సమంత. ఒకేసారి నటనలో పలు వేరియేషన్స్ చూపిస్తూ వావ్ అనిపించింది. ఒక కోడలికి ఎన్ని లక్షణాలు ఉండాలి..? నాకు ఇవేవీ లేవే.. అనే డైలాగ్.. నా ప్రాణం అడ్డుపెట్టైనా ..నా ఫ్యామిలీ కి ఏమి కాకుండా చూసుకుంటా అనే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది అనే లైన్ తో మా ఇంటి బంగారం సినిమా తెరకెక్కినట్లు ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications