నిరుద్యోగులకు తీపికబురు..త్వరలో భారీ ఉద్యోగాల జాతర!

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు తీపికబురు. ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారికి రాబోయే రోజుల్లో గొప్ప అవకాశం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో సుమారు 6,000 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

వివిధ శాఖల్లో పోస్టులను భర్తీ చేయడానికి ప్రణాళికలు

ప్రభుత్వం ప్రస్తుతం వివిధ డిపార్ట్‌మెంటుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను సమీక్షించే పనిలో ఉంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 వంటి వివిధ స్థాయి ఉద్యోగాలు, అలాగే పోలీసు, వైద్య, విద్య, అడ్మినిస్ట్రేటివ్ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా యువతకు మంచి అవకాశాలు లభించేలా ప్రాసెస్‌ను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.

Telangana to release jobs notification for 6000 Government Jobs soon Good news to unemployed

గత లోపాలను దిద్దుకుని త్వరలో షెడ్యూల్

ఈ ఉద్యోగ భర్తీ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులు మరియు యువతీ, యువకుల ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులు, పరీక్షల షెడ్యూల్‌ను స్పష్టంగా ప్రకటించనుంది. గతంలో జరిగిన ఉద్యోగ భర్తీలలో గమనించిన లోపాలను సరిద్దుకుని, మరింత పారదర్శకంగా మరియు వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

నిరుద్యోగ యువత కోసం భారీ ఉద్యోగాల భర్తీ

అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ విధానాలు తదితర వివరాలు నోటిఫికేషన్‌లో స్పష్టంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా లాభపడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపనుంది. ఈ భారీ ఉద్యోగ భర్తీతో తెలంగాణలో నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుందని, యువతలో ఆశావాదం పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రూ.30 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీ వలలో శామీర్ పేట MRO మేడమ్!
రూ.30 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీ వలలో శామీర్ పేట MRO మేడమ్!

వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అప్డేట్ ముఖ్యం

నోటిఫికేషన్ విడుదలకు ముందు అభ్యర్థులు సిలబస్, పాత ప్రశ్నపత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొత్త నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ తప్పనిసరిగా తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది OTR నమోదు చేసుకున్నా, వారిలో కేవలం 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్‌గా దరఖాస్తులు చేస్తున్నారు. మిగిలిన అభ్యర్థులు వెంటనే OTR అప్‌డేట్ చేసుకోవాలని కమిషన్ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+