14ఏళ్ల వనవాసం పూర్తైంది: కిరణ్‌పై మళ్లీ అసదుద్దీన్ ఫైర్

కిరణ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ నేపథ్యంలో అసదుద్దీన్ దారుస్సలేంలో 13 ముస్లిం సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చర్యలతో పాతబస్తీ స్తంభించిందన్నారు. 25 తర్వాత తాము రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఉపసంహరించామో ప్రజలకు వివరిస్తామన్నారు. చార్మినార్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు.
ఉప ముఖ్యమంత్రి ఆలయాన్ని సందర్శించడం మత విధానానికి నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఒక్క ముస్లిం ఓటు కూడా పడదన్నారు. ఎంఐఎం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు యునైటెడ్ ముస్లిం జెఏసి ప్రకటించింది. ప్రభుత్వం మతరమైన సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. మతసామరస్యం కాపాడలేని ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలన్నారు.
కాగా సిపి అనురాగ్ శర్మకు, హెచ్చార్సీకి మజ్లిస్ నేతలు ముస్లింల మనోభావాలు కాపాడాలంటూ వినతిపత్రం అందించారు. మజ్లిస్ ఫిర్యాదు స్వీకరించిన హెచ్చార్సీ 48 గంటల్లో పాతబస్తీ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications