వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వైపు మజ్లిస్: ఎపిపై సోనియా దృష్టి, ఢిల్లీకి సిఎం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెసుతో పన్నెండేళ్లు కలిసి ఉన్న మజ్లిస్ పార్టీ రెండు రోజుల క్రితం రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, కేంద్రంలో యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి వాయలార్ రవికి ఫోన్ చేసి అందుబాటులో ఉండాల్సిందిగా సోనియా సూచించారు.

దీంతో వాయలార్ రవి తన విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చర్చించేందుకే సోనియా గాంధీ వాయలార్‌ను వెంటనే పిలిపించుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా అధిష్టానం పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. మజ్లిస్ మద్దతు ఉపసంహరణ విషయమై కిరణ్‌తో చర్చించనుంది.

ఎందుకు మద్దతు ఉపసంహరించుకుంది? రాజకీయా కారణాలా లేక మరేదైనా ఉందా? వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారా? తదితర అంశాలపై కిరణ్ నుండి సమాచారం తీసుకోనుందని తెలుస్తోంది. ఇప్పటికే చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ రాజకీయ కారణాలతోనే మజ్లిస్ తన మద్దతు ఉపసంహరించుకుందని ఆరోపించారు.

కాంగ్రెసు పార్టీ నేతలు పలువురు మజ్లిస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడాన్ని తప్పు పడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి బద్ద వ్యతిరేకిగా ముద్రపడిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా మజ్లిస్ ఉపసంహరణతో ప్రభుత్వానికి ఇబ్బంది లేదని చెప్పారు. పలువురు నేతలు మజ్లిస్ మద్దతు ఉపసంహరణ వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని ఇప్పటికే అధిష్టానానికి చేరవేసినట్లుగా తెలుస్తోంది.

English summary

 AICC president Sonia Gandhi has called central minister Vayalar Ravi for talk about Andhra Pradesh present situations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X