తెలియదు: మజ్లిస్ తెగతెంపులపై ఆజాద్, బొత్స ధ్వజం

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ/ఏలూరు: రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, కేంద్రంలో యూపిఏ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయానికి సంబంధించి తనకు పూర్తిగా తెలియదని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ బుధవారం న్యూఢిల్లీలో చెప్పారు. మజ్లిస్ తమ పార్టీతో తెగతెంపులకు సిద్ధపడటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఏం జరిగిందో తనకు పూర్తి సమాచారం లేదనన్నారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఆయన నుండి పూర్తి విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు. ముఖ్యమంత్రి మార్పు, 17న సిఎల్పీ సమావేశం ఉంటుందనే ప్రచారంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసదుద్దీన్‌తో మాట్లాడేందుకు అందుబాటులో లేరని, సంప్రదింపులు కొనసాగిస్తామన్నారు.

మజ్లిస్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని, తాను విదేశీ పర్యటనలో ఉండగా ఇది జరిగిందని, పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తానని ఆజాద్ చెప్పారు. ముఖ్యమంత్రితో, పిసిసి అధ్యక్షుడితో మాట్లాడుతున్నానని, ఇలా జరగాల్సి ఉండకుండెనన్నారు. తన హైదరాబాద్ పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు. ఆజాద్ ఢాకా నుండి అకస్మాత్తుగా తిరిగి వచ్చారు.

వ్యతిరేకం కాదు

కాంగ్రెసు పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. కాంగ్రెసు మతతత్వవాదులతో కలిసిపోయిందన్న అసదుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు. అసద్ ఆరోపణలు ఏకపక్ష ధోరణితో ఉన్నాయన్నారు. కాంగ్రెసు పాలనలో ముస్లింలకు అన్యాయం జరిగిందనడం అవాస్తవమన్నారు.

మజ్లిస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వేరుగా అన్నారు. ముఖ్యమంత్రి మార్పు విషయమై తానేమీ మాట్లాడనన్నారు. అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+