ఇంజనీరింగ్ అమ్మాయి లవ్‌స్టోరీ ట్విస్ట్: 60ఏళ్ల వ్యక్తితో..

ఆ పరిచయం కాస్తా క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు సంవత్సరం పాటు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ప్రేమ ఊసులు చెప్పుకున్నారు. అమ్మాయి అయితే ఏకంగా పెళ్లి కలలు కనిందట. తనతో ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలియకుండానే ఆ యువతి అతనిని మనసులో ఎన్నెన్నో ఊహించుకుంది.
ఫోన్ ద్వారా పరిచయమైన వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆ ఇంజనీరింగ్ యువతి తన మన్మధుడిని చూడాలనకుంది. అతనికి చెప్పింది. అతడు కూడా సరేనన్నాడు. అతని కోసం ఓ బస్టాప్‌లో వెయిట్ చేసింది. అయితే అతను రాలేదు. అమ్మాయి దీర్ఘకాలంగా అక్కడ ఉండటం పోలీసులు చూశారు.
అమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. పోలీసులు ప్రశ్నించడంతో ఆమె తన ప్రేమ వ్యవహారాన్ని తెలిపింది. పోలీసులు అతనిని పట్టుకొచ్చారు. అతన్ని చూసిన ఆ లవర్ షాక్‌కు గురయింది. ఎందుకంటే ఇన్నాళ్లూ తనతో ప్రేమ ఊసులు చెప్పిన ఆ వ్యక్తి ఆరవై ఏళ్లు దాటిన పండు ముసలి.
దీంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. తాను పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది, తను కలలు కన్న ఆ వ్యక్తి ముసలి వ్యక్తి అని తెలియడంతో ఆమె ఏడ్చింది. అయితే అతను మాత్రం తాను ఏదో సరదాకు ఆటపట్టించానని చెప్పి ఆమెను ఓదార్చాడు. తాను ప్రేమించింది నవ మన్మథుడిని కాకుండా పండు ముసలి వ్యక్తిని అని తేలడంతో ఆమె ఒకింత బాధతో వెనక్కి వెళ్లిపోయింది.












Click it and Unblock the Notifications