హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మజ్లీస్ హెచ్చరికను సిఎం తేలిగ్గా తీసుకున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరికలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మద్దుతు ఉపసంహరించుకుంటామని మజ్లీస్ నేతలు ముందుగానే సంకేతాలు ఇచ్చినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని అంటున్నారు. వెనక్కి రాలేని పద్ధతిలో అసదుద్దీన్ ప్రకటన చేయగానే కంగు తిన్నట్లు చెబుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని కాంగ్రెసు వర్గాలే అంటున్నాయి.

మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెసు నాయకులు ఓ వైపు విజ్ఞప్తి చేస్తూనే మరో వైపు మజ్లీస్ కటీఫ్ చేసుకోవడ వల్ల నష్టమేమీ లేదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మజ్లీస్‌ విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెసు నాయకులు విఫలమయ్యారని అంటున్నారు. చివరికి బుధవారం సాయంత్రం మైనారిటీ కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీతో కలిసి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మజ్లీస్ వ్యవహారంపై మాట్లాడారు.

జాతీయ దృక్పథం గల అసదుద్దీన్ ఓవైసీ చిన్న విషయంపై మద్దతు ఉపసంహరించుకోవడం సరి కాదని అంటూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో తాము హైకోర్టు తీర్పునే అమలు చేస్తున్నట్లు తెలిపారు. మజ్లీస్ తమతో తెగదెంపులు చేసుకోవడం వెనక వేరే రాజకీయ ఎజెండా ఉందని, అంత మాత్రాన కాంగ్రెసును మతవాద పార్టీగా అభివర్ణించడం సరి కాదని ఆయన అన్నారు.

మజ్లీస్ తెగదెంపుల వల్ల తమకు ఏ విధమైన నష్టం లేదని షబ్బీర్ అలీ అన్నారు. మజ్లీస్‌ను బహిరంగంగా ఎదుర్కునే విషయంలో ఒక్కటిగా వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెసు నాయకులు కనిపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి తీరు పట్ల చాలా మంది అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి నాయకులు ముఖ్యమంత్రి తీరును తప్పు పడుతున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం అంశాన్ని ముఖ్యమంత్రి స్థానిక పరిష్కారం కోసం ప్రయత్నించి ఉండాల్సిందని అంటున్నారు. దాన్ని ముఖ్యమంత్రి శాంతిభద్రతల సమస్యగానే చూడడం సరి కాదని వ్యాఖ్యానిస్తున్నారు.

పాతబస్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులను సంప్రదించకుండా డిజిపి దినేష్ రెడ్డి అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వడం కూడా చాలా మందికి మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రి తీరుపై పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం ఢిల్లీకి వెళ్లిన బొత్స సత్యనారాయణ ప్రస్తుత స్థితిపై అధిష్టానానికి నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి.

English summary
The state Congress on Wednesday publicly offered an olive branch as well as issued a veiled warning to the MIM over the severance of ties with the UPA government at the Centre and the Kiran Kumar Reddy government in the state. But in private, several leaders keen on dislodging the chief minister blamed him for mishandling the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X