ఉద్యోగుల సంక్షేమ శాఖ మంత్రిగా స్వామిగౌడ్: కెసిఆర్

స్వామి గౌడ్‌ను పోలిట్ బ్యూరోలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఎమ్మెల్సీగా స్వామి గౌడ్‌ను ఎంపిక చేశానని, ఎవరూ అసంతృప్తికి గురి కావొద్దని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. తాను 2009లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్న సమయంలో తనకు మానసికంగా స్వామి గౌడ్ ఎంతో ధైర్యం ఇచ్చారన్నారు. తెలంగాణ భవనంలో పార్టీ కండువాను కప్పి ఆయనను తెరాసలోకి కెసిఆర్ ఆహ్వానించారు.
తాను నిన్నటి వరకు నిర్ణయాలు తీసుకున్నానని, ఈ రోజు నుండి మీ నిర్ణయాలను అమలు చేస్తానని స్వామి గౌడ్ అనంతరం మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండి అహర్నిషలు కృషి చేస్తానని చెప్పారు. తెరాసతోనే తెలంగాణ సాధ్యమన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో తెరాస పోరాడుతున్నందునే తాను ఈ పార్టీలో చేరానని స్వామి గౌడ్ చెప్పారు.












Click it and Unblock the Notifications