కెసిఆర్ ఆహ్వానం, ఒత్తిడి: టిఆర్ఎస్‌లోకి స్వామిగౌడ్

అయితే అప్పటికప్పుడు స్పందించని స్వామి గౌడ్ ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరడం లేదని, తెలంగాణ కోసమే పోరాటం చేస్తానని ప్రకటించారు. వివిధ సందర్భాల్లో ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు స్వామి గౌడ్‌ను చేర్చుకునేందుకు తెరాస,బిజెపిలు ప్రయత్నించాయి. అయితే తెరాసలో చేరేందుకే మొగ్గుచూపిన స్వామి గౌడ్.. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు.
పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి తెరాసలో చేరిన సందర్భంగా గురువారం నిర్వహించిన సభలోనూ స్వామి గౌడ్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరుగనున్న సమావేశానికి తెలంగాణ ఐకాస ముఖ్యులను అదే వేదికపై నుంచి కెసిఆర్ ఆహ్వానించారు. వారిలో ఐకాస కన్వీనర్‌గా ఉన్న స్వామి గౌడ్ కూడా ఉన్నారు. ఉద్యోగ జెఏసిలో కీలక పాత్ర పోషించిన స్వామి గౌడ్‌ను పార్టీలో చేర్చుకునేందుకు కెసిఆర్ ఆయనపై ఒత్తిడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ ఉద్యోగ జెఏసి ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులను ఐక్యం చేయడంలోను, వారిని ఉద్యమ దిశగా నడిపించడంలోను స్వామిగౌడ్ కీలక పాత్ర పోషించారు. ఒక దశలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన తెరాసలోచేరతారని, చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు కోరారని కూడా అప్పట్లో తీవ్ర ప్రచారం జరిగింది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications