చిన్నపిల్ల మాటలొద్దు, తెల్సుకో: షర్మిలకు బొత్స ఆవేశం

మా నాన్న కష్టపడితే మంత్రి రఘువీరా లబ్ధి పొందుతున్నారని షర్మిల చెబుతున్నారని, అలా చెప్పడం సరికాదని, షర్మిల చిన్నపిల్ల అని, తెలుసుకొని మాట్లాడాలన్నారు. ప్రభుత్వంలో చేపట్టే కార్యక్రమాలు ఒకరికి చెందవన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అంటే మీకే కాదు... తమకూ అభిమానముందన్నారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పేద ప్రజల సంక్షేమం ఎజెండాగా కాంగ్రెసు ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.3641 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఈ లెక్కలు ఎవరికో సమాధానం చెప్పేందుకు తాను చెప్పడం లేదని, మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని బొత్స షర్మిలను ఉద్దేశించి అన్నారు. కేవలం ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదని చెప్పేందుకే తాను చెప్పానన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం కానీ, షర్మిల మరో ప్రజా ప్రస్థానం కానీ అధికారం కోసం చేస్తున్న పాదయాత్రలు అన్నారు.
కానీ తమ మంత్రి రఘువీరా రెడ్డి అధికారంలో ఉండి ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్రను తలపెట్టారన్నారు. విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టి పథకాలను రఘువీరా ప్రజల్లోకి తీసుకు వెళ్తారన్నారు. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొడతామన్నారు. తప్పులుంటే సరిదిద్దుకుంటామని, ఆశ్వీర్వదించాలని బొత్స ప్రజలను కోరారు. బొత్స ఒకింత ఆవేశంగా ఈ సభలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications