బాబు భయపడుతున్నారు, అమ్మవడి పెడతాం: షర్మిల

Sharmila
కర్నూలు: ప్రజా వ్యతిరేక కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెడుతుందా లేక తాము పెడితే వారు మద్దతిస్తారా చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో అన్నారు. శనివారం కర్నూలు జిల్లాలో 31వ రోజు ఆమె పాదయాత్ర చేశారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో చిత్తశుద్ధి లేదన్నారు.

అదే నిజమైతే అవిశ్వాసంపై స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయని షర్మిల ప్రజలకు హామీ ఇచ్చారు. జగన్‌తోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రాజ్యం సాధ్యమన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు అధికారంలోకి వస్తే అమ్మవడి పథకం ద్వారా పదో తరగతి వరకూ విద్యార్థులకు రూ.500, ఇంటర్ విద్యకు రూ.700, డిగ్రీ విద్యకు రూ.1000 విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. వృద్దులు, వితంతు పింఛన్లు రూ.700కు, వికలాంగ పింఛన్ రూ.1000కి పెంచుతామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు భయపడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+