కిరణ్, బొత్స అసమర్థులు: సోనియాకు కేంద్రమంత్రి లేఖ

బొత్సను కూడా అసమర్థ నేతగా పేర్కొంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనను లిక్కర్ డాన్, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా అంటూ పేర్కొన్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కిరణ్‌ను, పిసిసి చీఫ్‌గా బొత్సను వెంటనే తప్పించాలని ఆయన తన లేఖలో సోనియాకు సూచించినట్లుగా తెలుస్తోంది.
వారిని తొలగిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలపడుతుందని లేదంటే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారని సమాచారం. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారి స్థానంలో పగ్గాలను ఇతరులకు అప్పగించాలని సూచించారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే నాయకత్వ మార్పులపై జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో కిషోర్ చంద్ర దేవ్ లేఖ కలకలం రేపుతోంది.
అయితే ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌లకు వ్యతిరేకంగా తాను ఎలాంటి లేఖ రాయలేదని కిషోర్ చంద్రదేవ్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications