ఈడికి జగతి పెట్టుబడుల వివరాలిచ్చా: విజయ సాయి

తాను మళ్లీ ఈ నెల 30వ తేది ఈడి ఎదుట హాజరవుతానని చెప్పారు. ఈడి అధికారులు వివిధ ప్రశ్నలు వేశారని, తాను వాటికి సవివరంగా సమాధానాలు ఇచ్చానని చెప్పారు. తాను చెప్పిన దానిని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు రికార్డ్ చేశారని విజయ సాయి రెడ్డి చెప్పారు. జగతి పెట్టుబడుల వివరాలు తెలియజేశానన్నారు.
కాగా సిబిఐ సమర్పించిన రెండో విడత ఛార్జీసీటు ఆధారంగా విజయ సాయి రెడ్డిని ఈడి ప్రశ్నించింది. రెండవ చార్జీషీటులో ఉన్నటు వంటి ఆస్తుల వివరాలు, ఆదాయ వనరులు తదితర వాటిపై ఈడి ప్రశ్నించినట్లుగా సమాచారం. విజయ సాయి ఇచ్చిన ఆధారాల ప్రకారం త్వరలో ఈడి మళ్ళీ ఆస్తుల అటాచ్‌మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది వరకు మొదటి చార్జీషీటు ఆధారంగా విచారణ జరిపిన ఈడి 52 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications