హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లిక్కర్ సిండికేట్: బొత్స, మోపిదేవిలకు ఎసిబి క్లీన్‌చిట్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana-Botsa Satyanarayana
హైదరాబాద్: కొద్ది నెలల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం సిండికేటు వ్యవహారంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ తదితర రాజకీయ నాయకుల పేర్లు లేవు. వీరిద్దరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులపై లిక్కర్ సిండికేటులో ఉన్నారంటూ అప్పట్లో జోరుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన ఎసిబి నివేదికలో మాత్రం ప్రజాప్రతినిధుల పేర్లు ఎవరివీ లేవు.

ఎసిబి నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బొత్స, మోపిదేవిలపై ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో వెల్లడించారు. మద్యం సిండికేట్ల కేసులో 1100 మందిని నిందితులుగా ఎసిబి పేర్కొంది. వందమంది ప్రభుత్వ అధికారులపై విచారణ చేయాలని, ప్రభుత్వానికి ఎసిబి సిఫార్సు చేసింది. నిందితులుగా పేర్కొన్న వారిలో ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.

మద్యం సిండికేట్లలో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. తుది నివేదికలో నాలుగు ఆసక్తికరమైన అంశాలను ఎసిబి ప్రస్తావించింది. నిందితులపై ప్రాసిక్యూషన్, క్రమశిక్షణాపరమైన చర్యలు, శాఖాపరమైన చర్యలు, విచారణకు సిఫార్సు చేయాలని సూచించింది. నిందితులైన ఉద్యోగులందరి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, నాలుగు వందల మంది ఉన్నారని సూచించింది.

300 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, 250 మందిపై విచారణకు ఎసిబి సిఫార్సు చేసింది. రూ.50 నుండి 75 కోట్ల ముడుపులు చేతులు మారినట్లుగా ఆరోపించింది. ప్రజాప్రతినిధుల పాత్రపై ఆధారాలు లేవని తెలిపింది. 48 కేసులు నమోదయ్యాయని, 132 మందిని అరెస్టు చేసినట్లు చెప్పింది. నిందితుల్లో బాలరాజు, నున్నా రమణ సహా 85 మంది ప్రయివేటు వ్యక్తులున్నారని పేర్కొంది.

మూడువేలకు పైగా తెల్ల రేషన్ కార్డుదారులు మద్యం దుకాణాలను కలిగి ఉన్నట్లుగా నివేదికలో ఎసిబి పేర్కొంది. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని సూచించింది. కాగా మద్యం సిండికేట్ వ్యవహారంలో ఎసిబి నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద తలలను వదిలి పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. కాగా నివేదికపై అధికార యంత్రాంగంలో కలకలం రేగుతోంది.

English summary
Government of Andhra Pradesh submitted ACB's Liquor Syndicate report in High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X