అల్లా మాఫ్ కర్నా: ఇవే కసబ్ చివరి మాటలు

వైద్యుడు, వైద్య బృందం, జైలు, జిల్లా అధికారుల సమక్షంలో కసబ్‌ను బుధవారం ఉదయం ఉరితీశారు. ఉరి తీసేటప్పుడు కసబ్ ఏ మాత్రం ప్రతిఘటించలేదని తెలుస్తోంది. ముంబై ఆర్థర్ రోడ్డు జైలు నుంచి మంగళవారం తెల్లవారు జామున ఎరవాడ జైలుకు తరలించారు. స్పెషల్ కమెండోలతో కూడిన ఆరు వాహనాలు అనుసరిస్తుండగా కసబ్‌ను ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే మీదుగా తరలించారు.
కసబ్‌ను తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు యెరవాడ జైలుకు తీసుకుని వచ్చారు. అతని శారీరక దార్ఢ్యాన్ని పరీక్షించారు. అతను 52.5 కిలోలు తూగినట్లు చెబుతున్నారు. రక్తప్రసరణ సాధారణ స్థితిలో 120/80 ఉన్నట్లు ధ్రువీకరించుకున్నారు. జైలు మానసిక నిపుణుడు కసబ్ మానసిక స్థితిని పరీక్షించాడు.
కసబ్ అతి మామూలుగా కనిపించాడని, వైద్యులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడని అంటున్నారు. ఆందోళనకు గురైనట్లు కసబ్ కనిపించలేదని సమాచారం. జైలులోని ఖైదీలందరినీ హైసెక్యూరిటీ అండా సెల్‌లోకి మార్చి, కసబ్‌ను ప్రత్యేక సెల్‌లో ఉంచినట్లు చెబుతున్నారు. ఫాన్సీ యార్దుకు తీసుకుని వెళ్లే ఖైదీలను ఉంచే సెల్‌లో అతన్ని ఉంచారు. బుధవారం ఉరి తీస్తున్నట్లు అధికారులు మంగళవారం సాయంత్రం కసబ్‌కు చెప్పారు. అది విన్న తర్వాత కూడా కసబ్ చలించలేదని, కూల్‌గా కనిపించాడని అంటున్నారు. పాటలు పాడాడని సమాచారం.












Click it and Unblock the Notifications