వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధర్మానకు ప్రాసిక్యూషన్‌కు నో: సిఎంకు డిఎల్ ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

Dharmana Prasad Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మంత్రి ధర్మాన రాజీనామాపై సుదీర్ఘ చర్చ జరిగింది. ధర్మానపై సిబిఐ ప్రాసిక్యూషన్‌కు నిరాకరిస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ధర్మాన రాజీనామాను కూడా తిరస్కరించాలని మంత్రి వర్గం అభిప్రాయపడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధర్మాన రాజీనామాను తిరస్కరించే అవకాశం ఉంది.

ధర్మాన రాజీనామా ఆమోదాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టడాన్ని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రేనని, దాన్ని మంత్రి వర్గ సమావేశంలో ఎందుకు పెట్టారని అన్నట్లు తెలుస్తోంది. డిఎల్ రవీంద్రా రెడ్డికి సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి సర్ది చెప్పగా, దానిపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఈ నెల 29వ తేదీన మంత్రివర్గం మరోసారి సమావేశమై ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ముసాయిదాకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. పెట్టుబడి రాయితీపై కూడా అదే రోజు నిర్ణయం తీసుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదంపై ఆర్‌కె త్యాగి ఇచ్చిన నివేదికను మంత్రి వర్గం ఆమోదించింది. ఈ ప్రమాం వెనక ఏ విధమైన కుట్ర లేదని త్యాగి కమిటీ తేల్చింది.

ప్రభుత్వ ఉద్యోగుల డిఎ పెంపు, స్విమ్స్ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ శాఖల్లో దాదాపు 11 వేల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఐదుగురు మంత్రులు వివిధ కారణాల వల్ల మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాలేదు. గీతారెడ్డి, గల్లా అరుణకుమారి, గంటా శ్రీనివాస రావు, రఘు వీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు మంత్రివర్గ సమావేశానికి గైర్హాజయ్యారు. గంటా శ్రీనివాస రావు కాలికి గాయమై చికిత్స తీసుకుంటుండగా, రఘువీరా రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు.

English summary
State cabinet meeting held under presidentship of CM Kiran kumar Reddy has rejected for the prosecution of minister Dharmana Prasad Rao by CBI. Minister DL Ravindar Reddy has questioned CM attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X