హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌ రెడ్డికి చిరంజీవి కితాబు: తప్పు పట్టిన డిఎల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-DL Ravindra Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కితాబు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలన బాగుందని ఆయన అన్నారు. ఓ సినిమా కార్యక్రమంలో ఆయన కిరణ్ కుమార్ రెడ్డి పాలనను శనివారం ప్రశంసించారు.

పలు విపత్కర పరిస్థితులు ఎదురైనా కిరణ్ కుమార్ రెడ్డి తట్టుకుని నిలబడ్డారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహాయంతో సినీ రంగంపై వ్యాట్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గీతా ఆర్ట్స్ కొత్త చిత్రం కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు.

కాగా, మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు సిబిఐకి అనుమతి ఇవ్వకూడదనే ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి తప్పు పట్టారు. సిబిఐ విచారణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మంచిది కాదని ఆయన శనివారం కడప జిల్లాలో అన్నారు. మంత్రివర్గ సమావేశం వివరాలను బయటకు వెల్లడించడం మంచిది కాదని ఆయన అన్నారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామా వ్యవహారాన్ని మంత్రివర్గ సమావేశంలో పెట్టడం కూడా సరి కాదని ఆయన అన్నారు.

మంత్రివర్గ సమావేశం వివరాలను బయట చెప్పే అలవాటు తనకు లేదని, ధర్మాన వ్యవహారాన్ని మంత్రివర్గ సమావేశంలో పెట్టడాన్ని తాను వ్యతిరేకించినట్లు ఎలా బయటకు వచ్చిందో తనకు తెలియదని ఆయన అన్నారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రేనని, ఆ విషయంలో మంత్రివర్గాన్ని భాగస్వామిగా చేయడం సరి కాదని శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నట్లు వార్తలు వచ్చాయి.

English summary
The Union Minister Chiranjeevi has praised CM Kiran Kumar Reddy's administration. At the same time, minister DL Ravindra Reddy opposed Kiran Kumar Reddy's decision minister Dharmana Prasad Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X