జగన్ పార్టీలోకా, చూద్దాం: జవాబు దాటేసిన కావూరి

Kavuri Sambasiva Rao
విజయవాడ: పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశానని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలిచి, మాట్లాడితే రాజీనామాపై పునరాలోచిస్తానని కాంగ్రెసు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. ప్రస్తుతానికి రాజీనామాకే కట్టుబడి ఉన్నాఆయన అన్నారు.

నూజివీడులో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్నారు. మధ్యలో వచ్చిన వ్యక్తులను అందలం ఎక్కిస్తూ, పార్టీ కోసం శ్రమించిన వారిని విస్మరించటం బాధాకరమన్నారు.

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారా అని అడిగితే, 'ఈ విషయం పత్రికల్లోనే వస్తోంది. చూద్దాం. ఆలోచిద్దాం' అంటూ సమాధానం దాటవేశారు. కాంగ్రెస్ పార్టీని వీడటానికి మనస్ఫూర్తిగా ఇష్టంలేకున్నా, పార్టీ సీనియర్‌ల పట్ల చూపుతున్న వివక్ష, వారికి జరుగుతున్న అన్యాయం వల్ల విసిగి వేసారి రాజీనామా చేసినట్లు చెప్పారు.

తనకు మంత్రి పదవి దక్కకపోవడం రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. దాన్ని ఉపసంహరించుకోవాలని పార్టీ అధిష్టానం పెద్దలు చెప్పినా ఆయన వినలేదు. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాలం సమావేశాలకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు. ఇటీవల విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌తో కలిసి ఆయన హైదరాబాదులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. ముఖ్యమంత్రి చెప్పినా ఆయన రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+