కెసిఆరే టిడిపి జెండా మోశారు: ముందే మందకృష్ణ వేడి

ఈ ర్యాలీలో భారీగా ఎమ్మార్పీఎస్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడారు. గీతారెడ్డి పైన కోదండ వ్యాఖ్యలను కెసిఆర్ సమర్థించడం ఎంత వరకు సమంజసం అన్నారు. దళితులపై దాడులను కెసిఆర్ ఏనాడూ ఖండించలేదన్నారు. కోదండ క్షమాపణలు చెప్పినప్పటికీ కెసిఆర్ సమర్థనను నిరసిస్తూనే తాము నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు. దళిత సామాజిక వర్గాన్ని కించపరిస్తే కెసిఆర్ కుటుంబాన్ని నీడలా వెంటాడుతామన్నారు.
తాము తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. కోదండ వ్యాఖ్యలను సమర్థించినందుకు కెసిఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ కెసిఆర్ కుటుంబం జాగీరు కాదన్నారు. 85 శాతం బలహీన వర్గాల వారు ఉన్నారని వారిపై కెసిఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. తమమ ఆత్మగౌరవాన్ని పోగొట్టి తెలంగాణ ఉద్యమం నడపాలనుకుంటే ఖబర్దార్ కెసిఆర్ అంటూ హెచ్చరించారు.
తాము తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయడం కాదని, తమ వర్గీకరణకు మద్దతిచ్చే ప్రతి ఒక్కరికి తాము మద్దతిస్తామని చెప్పారు. టిడిపి జెండాను తాము ఎప్పుడూ మోయలేదని చెప్పారు. కానీ అదే కెసిఆర్ టిడిపి జెండాను 2009లో ఓట్లు సీట్ల కోసం మోశారన్నారు. కాగా భారీగా చేరుకున్న కార్యకర్తలు నల్లజెండాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications