ఎవరు పిలిచారో తెలియదు: కెసిఆర్‌కు వాయలార్ షాక్

Vayalar Ravi
న్యూఢిల్లీ: చర్చల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఎవరు పిలిచారో తనకు తెలియదని కాంగ్రెసు అధిష్టానం నేత, కేంద్ర మంత్రి వాయలార్ రవి అన్నారు. తెలంగాణపై నిర్ణయానికి అనువైన సమయం కావాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వలసలపై తాము ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో వలసలు సాధారణమేనని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలనేదే తమ ప్రయత్నమని ఆయన అన్నారు. తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెలంగాణపై గడువు పెట్టడం కొత్తేమీ కాదని ఆయన అన్నారు. పార్టీ వైఖరి తెలిసినవారెవరూ ఆందోళన చెందరని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం వెల్లడించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానాన్ని కోరిన విషయం తెలిసిందే. కెసిఆర్‌ను ఎవరు చర్చలకు పలిచారనేద అప్రస్తుతమని, చర్చలు మాత్రం జరిపామని వాయలార్ రవి అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు పార్టీతోనే ఉంటారని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి మాట్లాడుతామని చెప్పారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల తర్వాత తాను రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పారు.

ఇదిలావుంటే, డిసెంబర్ 9వ తేదీలోగా తెలంగాణ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని ఎఐసిసి వర్గాలంటున్నాయి. తెలంగాణ సమస్యపై తీవ్రంగా ఆలోచన చేస్తున్నామని, సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని ఆ వర్గాలన్నాయి. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రతిపాదించే ఆలోచన లేదని అన్నాయి.

ఇదిలావుంటే, డిసెంబర్ 9వ తేదీలోపు తెలంగాణపై కాంగ్రెసు సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఆమె సోమవారం పోలీసు స్ఠేషన్ భవనాలను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసులను త్వరలోనే ఎత్తివేస్తామని ఆమె చెప్పారు. మిలియన్ మార్చ్ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులపై నమోదైన కేసుల విషయం తన దృష్టికి రాలేదని ఆమె చెప్పారు.

ఉద్యోగ సంఘాల నేతలపై కేసులు ఉన్నట్లు తాను భావించడం లేదని ఆమె అన్నారు. సకల జనుల సమ్మె సమయంలో ప్రజాప్రతినిధులపై, విద్యార్థులపై పెట్టిన కేసులను పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. కరీంనగర్ జిల్లాలో నమోదైన 100 కేసులు పరిష్కార దశలో ఉన్నాయని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+