వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు షాక్: జగన్‌ను కల్సిన సీనియర్, కాంగ్రెస్ నేత..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ummareddy Venkatewarlu
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం కలుసుకున్నారు. ఉదయం ములాకత్ సమయంలో వైయస్సార్ కాంగ్రెసు అధినేతను ఉమ్మారెడ్డి కలిశారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి నర్సింహ రావు కూడా జగన్‌ను ఈ రోజు కలిసిన వారిలో ఉన్నారు.

కాగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు కొంతకాలంగా వస్తున్న విషయం తెలిసిందే. విజయమ్మ సమక్షంలో త్వరలో ఆయన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మారెడ్డి చేరికను పురస్కరించుకొని బాపట్లలో బహిరంగ సభ నిర్వహించి బల ప్రదర్శన చేసేందుకు అనుచరులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా వ్యవహరిస్తున్న ఉమ్మారెడ్డి కొంత కాలంగా పార్టీకి దూరం గా ఉంటున్నారు. 2009 ఎన్నికల్లో లోక్‌సభ సీటును, తరువాత రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించిన ఉమ్మారెడ్డి అవి దక్కకపోవటంతో అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మారెడ్డి పార్టీని వీడకుండా చూసేందుకు జిల్లాకు చెందిన నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

చాలా కాలంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీలో కాపులకు తగిన న్యాయం జరగలేదని ఆయన కొంతకాలం క్రితం అన్నారు. ఆయన అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో మొదటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కీలక పాత్ర పోషించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో, పార్టీ తీర్మానాల రూపకల్పనలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో కూడా టిడిపి ముఖ్య నేతల్లో ఆయన ఒకరు.

English summary
Telugudesam Party senior leader Ummareddy Venkatewarlu met YSR Congress party chief YS Jaganmohan Reddy in Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X