వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిలవి ప్రగల్భాలు: జానా, బాబే రక్షిస్తున్నారు: షర్మిల

By Pratap
|
Google Oneindia TeluguNews

Janareddy - Sharmila
హైదరాబాద్/ మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల వ్యాఖ్యలపై సీనియర్ మంత్రి కె. జానారెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. షర్మిలవి ప్రగల్భాలేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. తన పాదయాత్రతో షర్మిల ప్రజల్లో భ్రమలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్సించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పాలించే హక్కు లేదని షర్మిల అనడం ప్రజాస్వామ్యాన్ని అవహాస్యం చేయడమేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అవిశ్వాస తీర్మానం ఒక వేదిక మాత్రమేనని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు రాష్ట్రంలో లేవని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రిపై షర్మిల అవగాహనారాహిత్యంతో విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువలకు రేపు నీరు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అవిశ్వాసం పెడితే ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. ఇరు వైపులా లక్షన్నర ఎకరాలకు చొప్పున నీరు అందేలా చూస్తామని అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని షర్మిల అన్నారు. ఆమె శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర కొనసాగించారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే బలం ఉన్నా చంద్రబాబు అందుకు సిద్ధపడడం లేదని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖక రెడ్డి ఉన్నప్పుడు ప్రతి పేదవాడూ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లేవాడని చెప్పారు. జూరాల వద్ద జెన్‌కో ప్రాజెక్టు నిర్మిస్తే జిల్లాకు న్యాయం జరుగతుందని చెప్పారు.

English summary
Senior minister K Jana Reddy has retaliated YSR Congress party president YS Jagan's sister Sharmila comments on CM Kiran kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X