• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సబ్ ప్లాన్‌పై చర్చ: దానం, మోత్కుపల్లి వివాదం

By Pratap
|
Mothukupally Narasimhulu
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై చర్చ సందర్బంగా శనివారం శాసనసభలో మంత్రి దానం నాగేందర్, తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. ఓ సవరణతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ శనివారం శాసనసభలో ప్రాతిపాదించారు. ఉన్నది ఉన్నట్టుగా నివేదిక ప్రకారం బిల్లును ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రికి ఎందుకు అభ్యంతరమని ఆయన అడిగారు. దళితులను అణగదొక్కింది, వారికి అన్యాంయ చేసింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన విమర్శించారు. కాంగ్రెసు వల్లనే అంటరానితనం కొనసాగిందని ఆయన అన్నారు.

దళితులకు న్యాయం జరగాలంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని ఆయన అన్నారు. దళితులకు రాజ్యాంగపరమైన హక్కును కల్పించింది అంబేడ్కర్ అని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించే అవకాశం అంబేడ్కర్‌కు కాంగ్రెసు పార్టీ ఇచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. దానికి మోత్కుపల్లి ప్రతిస్పందిస్తూ - దళితుడని చెప్పి అంబేడ్కర్‌కు ఆ అవకాశం ఇవ్వలేదని, ప్రపంచ మేధావుల్లో ఒక్కరు కాబట్టి అంబేడ్కర్‌కు ఆ అవకాశం వచ్చిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీల మనోవేదనను అర్థం చేసుకుని ఉంటే దళితులకు ఈ అవకాశం వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీ దళిత వ్యతిరేకి కాబట్టే దేశంలో ప్రాంతీయ పార్టీలు వచ్చాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలకు అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని - పరస్పర దూషణలకు వెళ్లి బిల్లు ప్రాముఖ్యాన్ని తగ్గించవద్దని, ఇదో చారిత్రాత్మకమైన బిల్లు అని, రాజకీయాలకు అతీతంగా చర్చ జరగాలని అన్నారు. దానికి మోత్కుపల్లి తీవ్రంగా మండిపడ్డారు. దళిత మంత్రి గీతారెడ్డిపై ఓ నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు ఖండించలేదని అడిగారు.

దళితులకు కేటాయించిన నిధులను జలయజ్ఞం పేరుతో దండుకున్నారని ఆయన ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి దళితుల భూములను పెత్తందార్లకు కట్టబెట్టారని ఆయన అన్నారు. అసైన్డ్ భూములను క్రమబద్దీకరించి దళితులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కమిటీ చైర్మన్‌గా ఉండడం తన అదృష్టమని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నిధుల వినియోగానికి ఓ యంత్రాంగం లేకపోతే అమలు కష్టమని ఆయన అన్నారు. సబ్ ప్లాన్ తయారీకీ 30 సమావేశాలు ఏర్పాటు చేశామని అన్నారు నివేదికను నాలుగు గోడల మధ్య రూపొందించలేదని, సమావేశాలు పెట్టి చర్చలు జరిపామని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
21,84,467
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  0.00%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  100.00%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  3.89%
  ఎస్సీ
 • ఎస్టీ
  1.24%
  ఎస్టీ

English summary
Telugudesam MLA Mothkupalli Narasimhulu, initiating debate on SC, ST sub plan, saif that Congress has meted out injustice to dalits. The sub plan will not do justice to Dalits, he opined.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more