విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడివాడ ఎవడి సొత్తు కాదు: బాలకృష్ణ, జంప్‌ల పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
విజయవాడ: హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ఆదివారం కృష్ణా జిల్లాలో జంప్ జిలానీల పైన, పార్టీ మారిన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని పైన పరోక్షంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుడివాడ ఎవరి సొత్తు కాదన్నారు. పార్టీని వీడిన వారు అందరూ పార్టీ ప్రతిష్ట పైనే గెలిచారు. అంతేకానీ సొంత ప్రతిష్ట పైన కాదని అభిప్రాయపడ్డారు. పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుండైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కొందరు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు. తాను ఎక్కడి నుండి పోటీ చేసేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో తెలుగుదేశం పార్టీదే విజయం అన్నారు. కొందరు అవకాశవాదం కోసం, స్వార్ధం కోసమే పార్టీని వీడుతున్నారన్నారు. కొందరు నేతలు వెళ్లిపోయినంత మాత్రాన నష్టం లేదని, పార్టీకి అంకిత భావంతో పని చేస్తే కార్యకర్తలు ఉన్నారని అన్నారు.

సినిమాల్లో తెలుగు భాషకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందన్నారు. తెలుగు సినిమాల్లో ఇటీవలి కాలంలో తెలుగుకు ప్రాధాన్యత తగ్గుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన సినిమాల్లో మాత్రం తెలుగుకు ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. తెలుగు భాష కోసం తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నానని చెప్పారు.

గన్నవరం చేరుకున్న బాలకృష్ణ హనుమాన్ జంక్షన్‌లో ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుండి గుడివాడక వెళ్లారు. స్థానిక పార్టీ నేత ఇంట్లో ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యేందుకు వచ్చారు. కాగా బాలకృష్ణకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు గన్నవరం విమానాశ్రయానికి తరలి వచ్చారు.

English summary

 Hero Nandamuri Balakrishna said Gudiwada is not any one, Telugudesam party will win in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X